ఇదివరకెన్నడూ కనిపించని ఛాలెంజింగ్ రోల్‌లో సమంత!
on Sep 26, 2020

దక్షిణాది టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. తన పర్ఫార్మెన్స్‌తోనే కాకుండా తన అందచందాలతోనూ మెస్మరైజ్ చేసే నటి. చివరగా ఆమె 'జాను' సినిమాలో టైటిల్ రోల్‌లో కనిపించింది. తమిళ హిట్ ఫిల్మ్ 96కు అది రీమేక్. అయితే తమిళ ఆడియెన్స్‌కు మాదిరిగా తెలుగు ప్రేక్షకుల్ని ఆ సినిమా అలరించలేకపోయింది. కారణం.. అందులోని కంటెంట్, స్లోగా ఉన్న నెరేషన్ అనేది విమర్శకుల అభిప్రాయం.
కాగా తమిళ డైరెక్టర్ అశ్విన్ శరవణన్‌తో ఓ హారర్ మూవీ చేయడానికి ఆమె అంగీకరించిందనే విషయం మనకు తెలుసు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. స్నేహ భర్త ప్రసన్న ఓ కీలక పాత్ర చేస్తోన్న ఈ థ్రిల్లర్‌లో సమంత ఓ దివ్యాంగురాలిగా కనిపించనున్నదని సమాచారం.
స్త్రీ ప్రధాన చిత్రంగా తయారయ్యే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందనున్నది. కొంత కాలం క్రితం తాను ఈ సినిమా చేస్తున్నట్లు ప్రసన్న వెల్లడించగా, ఇటీవల సమంత సైతం "ఇది కేవలం హారర్ ఫిల్మ్ మాత్రమే కాదు, దానికి మించింది." అని ట్వీట్ చేయడం గమనార్హం. ఇదివరకు ఓంకార్ డైరెక్ట్ చేసిన హారర్ ఫిల్మ్ 'రాజుగారి గది 2'లో ఆత్మగా కనిపించిన సమంత, ఈ మూవీలో మరింత ఆశ్చర్యకరమైన రోల్‌లో కనిపించనుండటం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



