'సామజవరగమన'తో సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు!
on Jun 25, 2023

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీవిష్ణు ఈసారి 'సామజవరగమన' అనే కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. జూన్ 29 న ఈ సినిమా విడుదల కానుంది.
'సామజవరగమన' నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు సామజవరగమన ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా సాగింది. ట్రైలర్ లో శ్రీవిష్ణు, నరేష్ పోటీపడి నవ్వులు పంచారు. ట్రైలర్ చూస్తుంటే కుటుంబమంతా కలిసి చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఇటీవల ఇలాంటి ఎంటర్టైనర్స్ తగ్గిపోయాయి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారే అవకాశముంది.
.webp)
మేకర్స్ ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. విడుదలకు మూడు రోజుల ముందుగానే జూన్ 26 న ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని థియేటర్స్ లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. మరి గతేడాది 'భళా తందనానా', 'అల్లూరి' సినిమాలతో నిరాశపరిచిన శ్రీవిష్ణు.. ఇప్పుడు ఈ 'సామజవరగమన'తో ఆకట్టుకొని సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. సినిమాటోగ్రాఫర్ గా రామ్‌రెడ్డి, ఎడిటర్ గా ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ గా బ్రహ్మ కడలి పనిచేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



