సల్లూభాయ్ మేనల్లుడికి ముద్దు పెట్టాడు..!
on Mar 31, 2016

గారాబంగా పెంచుకున్న ముద్దుల చెల్లికి కొడుకు పుడితే మేనమామ సంబరానికి ఆకాశమే హద్దు. సల్మాన్ ఎంతో అపురూపంగా చూసుకునే అర్పితకు బిడ్డ పుట్టగానే ఆయన ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఈ బాలీవుడ్ బాచిలర్ కు పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలతో చాలా తొందరగా కలిసిపోయి ఆటలాడుతుంటాడు కూడా. తను ఆడించడానికి పిల్లల్లేకపోవడంతో, ఇప్పుడు మేనల్లుడిని తన మీద ఎక్కించుకుని ఆడించడానికి ఎదురుచూస్తున్నాడు సల్మాన్. బుధవారం సల్మాన్ చెల్లలు అర్పిత, ఆయుష్ శర్మ దంపతులకు మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పుట్టీ పుట్టగానే ఆ బుడతడికి అహిల్ అని పేరు కూడా పెట్టేశారు. మా రాజకుమారుడు అహిల్ వచ్చేశాడు అని ఆయుష్ ట్వీట్ చేశాడు. సల్మాన్ తన మేనల్లుడిని ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోను కూడా అహిల్ తన ఇన్ స్టాగ్రాంలో పెట్టాడు. సల్మాన్ అభిమానులు ఈ ఫోటోను చూసి మురిసిపోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



