వైవీఎస్ చౌదరి హీరోయిన్ అరుదైన రికార్డు.. ముప్పై నిమిషాల ముందే టార్గెట్ రీచ్
on Jul 9, 2025

'వైవీఎస్ చౌదరి'(Yvs Chowdary)స్వీయ దర్శకత్వంలో 'చిరంజీవి'(Chiranjeevi)మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్'(Sai Dharam Tej)హీరోగా ప్రేక్షకులకి ముందుకు వచ్చిన చిత్రం 'రేయ్'. 2015 లో విడుదలైన ఈ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి 'సయామీ ఖేర్'(Saiyami Kher). ఆ తర్వాత 'మీర్జా' అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించి పలు చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలని పోషించింది. ఈ ఏడాది సన్నీడియోల్, గోపి చంద్ మలినేని(Gopichand Malineni)కాంబినేషన్ లో వచ్చిన 'జాట్'(Jaat)మూవీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి అభిమానులని అలరించింది.
ఫిట్ నెస్ కి అధిక ప్రాధాన్యమిచ్చే సయామీ వివిధ రకాల విదేశీ క్రీడల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగిన' ఐరన్ మాన్ 70.3 ట్రయాథ్లాన్'(Ironman 70.3 triathlon) ' రేస్ లో పాల్గొంది. ఈ రేస్‌లో 1.9 కిలోమీటర్ల దూరం స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్లు రన్నింగ్ ని ఒకే రోజులో పూర్తి చేయాలి. చలిలో ఎత్తైన కొండల మధ్య ఈ రేస్ జరుగుతుంది. ఈ రేస్ లో సయామీ విజయాన్ని అందుకుంది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన రేస్ లో కూడా సయామీ విజేతగా నిలవడంతో, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐరన్ మాన్ 70.3 ట్రయాథ్లాన్ ని ఏడాది వ్యవధిలో రెండుసార్లు పూర్తి చేసిన అరుదైన రికార్డుని సాధించినట్టయ్యింది. వరల్డ్ ట్రయాథ్లాన్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ఛాలెంజ్ ని యూరోపియన్ ఛాంపియన్‌షిప్ అని కూడా పిలుస్తారు.
ఈ ఘనత పై నయామి ఇనిస్టా వేదికగా స్పందిస్తు ప్రపంచానికి నేనేంటే ఏంటో నిరూపించుకోవడానికి ఇదంతా చెయ్యలేదు. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండాలని చేశాను. అనుకున్నట్టుగానే గత ఏడాది కంటే ఈ ఏడాది ముప్పై నిమిషాల ముందే టార్గెట్ ని పూర్తి చేశాను. క్రమ శిక్షణతో ఏదైనా సాధ్యమే అనడానికి నేనే ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చింది. సయామీ త్వరలో 'స్పెషల్ ఓపిఎస్ 2 ' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, వైల్డ్ డాగ్, హైవే వంటి మరో రెండు తెలుగు చిత్రాల్లో కూడా సయామీ నటించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



