తెలుగు సంగీత దర్శకుడికి ఆస్కారా!.. అసలు నమ్మేలా ఉందా?
on Mar 13, 2023

'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డును గెలుచుకొని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. అసలు ఒక తెలుగు సినిమా పాట ఆస్కార్ గెలుచుకోవడం అనేది ఇప్పటికీ ఒక కలలా ఉంది. కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాకి, తెలుగు సంగీత దర్శకుడికి ఆస్కార్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ ఎవరైనా వస్తుందనే ఆశ కనబరిచినా.. అది జరగని పని అని కొట్టి పారేసేవారు. అలాంటి మాటలకు చెక్ పెడుతూ 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా 'హిట్-1', 'హిట్-2' చిత్రాల దర్శకుడు శైలేశ్ కొలను చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఒక తెలుగు సంగీత దర్శకుడు ఆస్కార్ గెలుచుకున్నట్టుగా శైలేశ్ కొలను గతంలో ఓ కథను రాసుకున్నాడట. ఆ కథను కొందరికి వినిపించగా.. కథలో ఆస్కార్ అని పేర్కొనవద్దు, ఎందుకంటే అది అసలు నమ్మేలా లేదని అన్నారట. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న శైలేశ్ కొలను.. అందరూ అసాధ్యమని భావించిన దానిని సుసాధ్యం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి ధన్యవాదాలు తెలిపాడు. చాలా గర్వంగా ఉందని ట్వీట్ లో రాసుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



