అవకాశాల పల్లకిలో సాయి పల్లవి
on Sep 29, 2017
చిత్ర సీమ లో తనదైన ముద్ర వేసుకొని అందరిని ఆకట్టుకుంటూ అలరిస్తున్న యువ కథానాయకి సాయి పల్లవి. మలయాళీ ప్రేమమ్ తో మంత్రం ముగ్దులను చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో అందరిని అమితంగా ఆకట్టుకుంది. దాంతో ఆమెకు సినిమాల అవకాశాలు వరస పట్టాయి . సరికొత్త సినిమాలను చేస్తూ విజయాలను అందుకుంటున్న తమిళ కథానాయకుడు ధనుష్ తో జోడి కట్టే అవకాశం వచ్చేసింది. ఆయన నటించిన మారి చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న మారి -2 లో ఆయనతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వండర్ బాయ్ ఫిలిమ్స్ పతాకం పై ఈ సినిమాను ధనుష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మలయాళీ ,తెలుగు వాళ్ళందరిని ఇట్టే ఆకట్టుకున్న సాయి పల్లవి తమిళ వారందరిని మెప్పించబోతున్నది. అంతేకాదు తెలుగు చిత్రసీమలో ఆమెకు వరస అవకాశాలు వచ్చేస్తున్నాయి. సహజమైన నటనతో మెప్పును పొందుతున్న ఈ యువ కథానాయకి విజయాల పల్లకిలో పయనించాలని కోరుకుందాం.