Home

»

Latest News

నేను అసలు పెళ్లే చేసుకోను

Nov 3, 2016 12:31PM

ఈడొచ్చిన అమ్మాయిలను సహజంగా అడిగే ప్రశ్న నీ పెళ్లప్పుడని..ఇలాంటివి హీరోయిన్ల విషయంలో మరింత ఎక్కువగా వినిపిస్తాయి. తాజాగా మలయాళ ప్రేమమ్‌తో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది బెంగళూరు బ్యూటీ సాయిపల్లవి. ప్రేమమ్ కారణంగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రజంట్ తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తోంది సాయి. అయితే ఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్లు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. తాజాగా సాయిపల్లవి కూడా ట్విట్టర్ ద్వారా అభిమానులతో మాట కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు పల్లవి మీద ప్రశ్నల వర్షం కురిపించారు.

మేడమ్ మీ పెళ్లేప్పుడు..? అరెంజ్డ్‌ మ్యారేజ్ చేసుకుంటారా..? లవ్ మ్యారేజ్ చేసుకుంటారా..? అంటూ అడిగారు. దానికి సమాధానంగా నేను పెళ్లి చేసుకోను అంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు సాయి. జీవితాంతం నా తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అందుకనే నా లైఫ్‌లో పెళ్లి అనే మాట వినిపించదు అని తేల్చి చెప్పేశారు. మొత్తానికి పెళ్లి చేసుకోను అనే భామల జాబితాలోకి సాయిపల్లవి కూడా చేరిందన్న మాట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com