
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన ఇంటిని ఖాళీ చేశారు. రామానాయుడు గారు ఉన్నప్పటి నుంచి వెంకటేశ్ తన కుటుంబంతో కలిసి అదే ఇంట్లో ఉండేవారు..ఆ ఏరియాలో ఉన్న వారికి వెంకటేష్ ఇల్లు సుపరిచితమే. అయితే ప్రస్తుతం మణికొండలో మరిన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు నిర్మించుకోవడంతో వెంకటేశ్ తన మకాం అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇల్లు ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో గానీ వెంకీ మంచి ప్లాన్ చేశారు. తన ఇంటిని వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. ఇంటితో పాటు పక్కనే ఉన్న ఖాళీ స్థలం కూడా కలిపి అప్పగించేశారు. ఇప్పుడు ఆ ఏరియా మంచి బిజినెస్ సెంటర్‌గా మారిపోయింది..బడా బాబులంతా అర్థరాత్రి వరకు అక్కడ సందడి చేస్తున్నారు. ప్రజంట్ ఇంపోర్టెడ్ ఐస్ క్రీమ్ షాప్, డిఫరెంట్ కాంబినేషన్స్ లభించే జ్యూస్ స్టాల్స్ ఇక్కడ లభ్యమవుతుండటంతో వెంకీ హౌస్ హౌస్‌ఫుల్‌గా మారిపోయింది.




.jpg)

