సమంతని ఫాలో అవుతున్న సాయిపల్లవి!
on Jun 8, 2023
ఇప్పుడు ఓ విషయంలో సమంతని ఫాలో అవుతున్నారు సాయిపల్లవి. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా షూటింగ్ కశ్మీర్‌లో జరిగింది. సేమ్ కశ్మీర్‌కి ఇప్పుడు సాయిపల్లవి కూడా ప్రయాణమవుతున్నారు. అయితే ఆమె ట్రావెల్ చేస్తున్నది శివకార్తికేయన్ సినిమా కోసం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్‌కే21 అని టెంపరరీగా పేరు ఫిక్స్ చేశారు. ఈ చిత్రం షెడ్యూల్‌ని కశ్మీర్‌లో మొదలుపెట్టారు. ఈ సినిమాకు కమల్‌హాసన్ నిర్మాత. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎస్‌కే21ని నిర్మిస్తున్నారు. బుల్లితెర మీద తన స్టామినా ప్రూవ్ చేసుకుని మిమిక్రీ ఆర్టిస్టుగా, వ్యాఖ్యాతగా మెప్పించి హీరో అయ్యారు శివకార్తికేయన్. పక్కింటి అబ్బాయి ఇమేజ్‌తో పలు సినిమాలు చేసిన ఆయన రీసెంట్ టైమ్స్ లో వరుసగా 100 కోట్ల సినిమాలతో నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఆయన నటించిన మావీరన్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీని మడోన్ అశ్విన్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శంకర్ తనయ అదితి శంకర్ హీరోయిన్‌గా నటించారు. మిస్కిన్, సరిత, యోగిబాబు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. జూలై 14న విడుదల కానుంది మావీరన్. మావీరన్ పనులన్నీ పూర్తి చేసిన శివకార్తికేయన్ ఎస్‌కే 21 కోసం కశ్మీర్‌కి ట్రావెల్ చేశారు. ఆయనతో పాటు చిత్రబృందమంతా అక్కడికి వెళ్లారు.
అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ షూటింగ్‌ని ఆపేసింది టీమ్. మళ్లీ ఇప్పుడు అన్నీ పర్మిషన్లు తీసుకుని అక్కడికి వెళ్లారు. ఈ విషయాన్ని డైరక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో శివకార్తికేయన్ గెటప్‌ని సీక్రెట్‌గా ఉంచారు. న్యూ లుక్ బయటపడకుండా ఎక్కడికి వెళ్లినా టోపీతో కనిపిస్తున్నారు శివకార్తికేయన్. త్వరలోనే తన పోర్షన్ కోసం జాయిన్ అవుతారు సాయిపల్లవి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
