మెగా హీరో "జవాన్" స్టోరీ ఇదేనా..?
on Jan 30, 2017
వరుస సూపర్‌హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న మెగాహీరో సాయిథరమ్ తేజ్..అస్సలు గ్యాప్ తీసుకోకుండా వన్ బై వన్ మూవీ చేసుకుంటూ వెళుతున్నాడు..సుప్రీం హిట్ తర్వాత విన్నర్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రంలో క్యామియో రోల్‌లో నటిస్తూ బిజీగా ఉంటూనే ఇవాళ మరో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ప్రముఖ రచయిత కమ్ దర్శకుడు బీవీఎస్ రవి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు సాయి..ఈ సినిమాకు జవాన్ అనే పేరు ఫిక్స్ చేశారు. దేశాన్ని ఒక కుటుంబంగా భావించే యువకుడి కథ అని ఫిలింనగర్ టాక్. ఇదంతా పక్కనబెడితే ఈ సినిమా మూహుర్తపు షాట్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మూవీలో సాయిథరమ్ తేజ్ పక్కన మెహ్రీన్ కౌర్ హీరోయిన్గా నటిస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
