మెగాస్టార్ 'విశ్వంభర'లో మరో మెగా హీరో..!
on Feb 15, 2025
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర' (Vishwambhara). యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సర్ ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తోంది.
'విశ్వంభర' సినిమాలో ఒక మెగా హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. 'విశ్వంభర'లో ఒక ప్రత్యేక పాత్రలో సాయి తేజ్ కాసేపు సందడి చేయనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, మెగా డాటర్ నిహారిక సైతం ఈ సినిమాలోని ఒక సాంగ్ కనిపించనుందని సమాచారం.
సాయి తేజ్ ఇప్పటికే ఒక మేనమామ పవన్ కళ్యాణ్ తో 'బ్రో' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో మేనమామ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.
ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర' సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
