అర్జున్ రెడ్డి లా -ఆర్ ఎక్స్ 100 ఆడుతుందా ??
on Aug 7, 2019
అర్జునరెడ్డి తో విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగింది. అలాగే `ఆర్ ఎక్స్ 100`తో కార్తికేయ కి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇటీవల `అర్జున్ రెడ్డి`, బాలీవుడ్ లో `కబీర్ సింగ్ `గా రీమేకై బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తుంది. 280 కోట్లు కొల్లగొట్టి షాహిద్ కపూర్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చింది. అయితే ఇక ఈ సినిమా బాటలోనే ఇప్పుడు ``ఆర్ ఎక్స్ 100` సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అక్కడ సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. మిలన్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకు డైరెక్టర్. తెలుగు సినిమాలకు హిందీ లో భారీ డిమాండ్ ఉంది. అయితే `అర్జున్ రెడ్డి` సినిమా తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్ వంగా నే కబీర్ సింగ్ కి డైరెక్టర్ కావడం తో సినిమా అక్కడ కూడా వర్క్ అవుట్ అయ్యింది అంటున్నారు. మరి `ఆర్ ఎక్స్ 100` బాలీవుడ్ రీమేక్ కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తుండటం తో ఈ సినిమా `అర్జున్ రెడ్డి` అక్కడ సక్సెస్ కొట్టినట్లు కొడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చ జరుగుతుంది.