'రన్ బేబీ రన్' మూవీ రివ్యూ
on Mar 12, 2023

సినిమా పేరు: రన్ బేబీ రన్
తారాగణం: ఐశ్వర్య రాజేశ్, ఆర్జే బాలాజీ, ఇషా తల్వార్, రాధికా శరత్ కుమార్, నాగినీడు తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
ఎడిటింగ్: జి. మదన్
సినిమాటోగ్రఫీ: ఎస్. యువ
దర్శకత్వం: జియేన్ కృష్ణకుమార్
బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
నటి ఐశ్వర్య రాజేశ్ ప్రతీ సినిమాకి భిన్నమైన కథను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకుంటుంది. ఆహాలో విడుదలైన 'డ్రైవర్ జమున' అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న ఐశ్వర్య ఇప్పుడు అదే తరహాలో మరో కథతో ముందుకొచ్చింది. 'అమ్మోరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆర్జే బాలాజీ, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రన్ బేబీ రన్'. జియేన్ కృష్ణకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం..
కథ:
ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద నుండి సోఫియా అనే అమ్మాయి దూకి చనిపోవడంతో కథ మొదలవుతుంది. సోఫియా చనిపోయినందుకు తన ఫ్రెండ్ తార(ఐశ్వర్య రాజేశ్) ఏడుస్తుంది. కొన్నిరోజుల తర్వాత సత్య(ఆర్జే బాలాజీ) తను ప్రేమించి పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ప్రియాంక(ఇషా తల్వార్)కి గిఫ్ట్ ఇద్దామని గోల్డ్ షాప్ కి వెళ్లి జుంకీలు కొంటాడు. సత్య గిఫ్ట్ తీసుకొని కార్ ఎక్కి బయల్దేరుతుండగా తార(ఐశ్వర్య రాజేశ్) అతని కార్ ఎక్కి వెనుక సీట్ కింద దాక్కుంటుంది. ఆ తర్వాత సత్యతో తను ప్రాబ్లంలో ఉన్నట్టుగా చెప్పి సాయం అడుగుతుంది. తన కార్ లో తను ఉండే అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళగా అక్కడ నుండి తార ఒక అతడికి కాల్ చేస్తుంది. అతను రావడానికి రెండు గంటల సమయం పడుతుందని చెప్పాడని చెప్పగా సరేనని ఒప్పుకుంటాడు. ఆ మరుసటిరోజు ఉదయమే తార తన ఫ్లాట్ బాత్ రూం లో చనిపోయి ఉంటుంది. అదే సమయానికి సత్య అపార్ట్మెంట్ కి పోలీసులు సోదా చేయడానికి వస్తారు. ఆ పోలీసులలో ఒక కానిస్టేబుల్ సత్యకి ఫ్రెండ్ అవ్వడం, ఆ అమ్మాయిని చూసినా చూడనట్టుగా చెప్పడంతో సత్య పోలీసుల నుండి తప్పించుకుంటాడు. ఆ తార ఎలా చనిపోయింది? దానికి వెనుక ఎవరెవరు ఉన్నారు? సత్య అసలు నిజం తెలుసుకున్నాడా అనేది మిగతా కథ..
విశ్లేషణ:
మెడికల్ కాలేజీలో చనిపోయిన అమ్మాయితో మొదలైన కథ.. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు చనిపోయింది? ఆత్మహత్యా లేక హత్యా? అనే సస్పెన్స్ తో సాగుతుంది. ఆ తర్వాత కథలోకి తార(ఐశ్వర్య రాజేశ్) ఎంటర్ అయ్యాక కథలోకి వేగం పెరుగుతుంది. సత్య(ఆర్జే బాలాజీ) తారకి సాయం చేద్దామని చూస్తే.. అతడి ప్రాణాల మీదకే వస్తుంది. ఒకానొక పరిస్థితులలో సత్య చావాలనుకుంటాడు. వాళ్ళ అమ్మ కాల్ చేసి ధైర్యం ఇవ్వడంతో తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు సత్య. అసలు తారని వెంబడిస్తుందెవరు? అని వెతుకుతూ ఒక్కో క్లూని కనిపెట్టే సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి.
తారకి సాయం చేయడానికి సత్య డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్ నుండి కథ ఇంకా ఫాస్డ్ గా వెళుతుంది. ఫస్డాఫ్ లో కాలేజ్ నుండి చనిపోయిందెవరు.. దానికి తారకి గల సంబంధం ఏంటనే ఆసక్తికరమైన అంశాలను సెకండాఫ్ లో సమాధనమిచ్చాడు డైరెక్టర్. ఎక్కడా కూడా బోల్డ్ సీన్స్, బోల్డ్ లాంగ్వేజ్ లేకుండా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్. సత్య కాకుండా పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తుంటారు. అయితే వారికి పెద్దగా క్లూస్ ఏం లభించకపోవడంతో మర్చిపోతారు. చివరలో వచ్చే ట్విస్ట్ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
కథ ఓవరాల్ గా బాగుంది. కథలో ఎక్కడా కూడా లాగ్ లేకుండా కథని ముందుకు తీసుకెళ్ళారు డైరెక్టర్. సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటుగా క్రైమ్ ని ఇన్వాల్వ్ చేసి చివరి వరకు ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ తో కూడిన క్యూరియాసిటిని ప్రేక్షకుడు పొందేలా ఎంగేజ్ చేసాడు డైరెక్టర్. మదన్ ఎడిటింగ్ బాగుంది. సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా బిజిఎమ్ అదరగొట్టాడు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన సరైన బిజిఎమ్ అందించాడు సామ్. యువ సినిమాటోగ్రఫీ బాగుంది. జియేన్ కృష్ణకుమార్ డైరెక్షన్ ఆకట్టుకుంది.
నటీనటుల పనితీరు:
'కౌసల్యా కృష్ణమూర్తి' తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేశ్.. ఈ సినిమాలో తన అభినయంతో ఆకట్టుకుంది. నయనతార హీరోయిన్ గా చేసిన 'అమ్మోరు' లో టీవీ రిపోర్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్జే బాలాజీ.. ఈ సినిమాలో తన నటనతో ఒక మార్క్ ని క్రియేట్ చేసాడు. ఇషా తల్వార్ పాత్ర నిడివి చిన్నదే అయినా తన నటన బాగుంది. సత్యకి తల్లిగా రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. నాగినీడు తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర బాగానే నటించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
ఈ సినిమాని కామన్ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే అభిమానులకు ఈ సినిమా ఫీస్ట్ అనే చెప్పాలి.
రేటింగ్: 3.5/5
-దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



