సెప్టంబర్ 4న 'రుద్రమదేవి'
on Jul 24, 2015

ఎట్టకేలకు దర్సకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అసలు ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ మధ్యలో కొన్ని ఆర్ధిక ఇబ్బందులు.. దానికి తోడు బాహుబలి సినిమా కూడా విడుదలయ్యేసరికి 'రుద్రమదేవి సినిమా రిలీజ్ డైలమాలో పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సెప్టంబర్ 4వ తేదీన 'రుద్రమదేవి' చిత్రాన్ని భారి ఎత్తున విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే మొదట తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేస్తామని తెలిపారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో అనుష్క, రానా, అల్లు అర్జున్ నటించారు. 'రుద్రమదేవి' తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే బాహుబలి సినిమాతో ప్రేక్షకులు ఫుల్లు హ్యాపీతో ఉన్నారు... ఇక రుద్రమదేవి కూడా వచ్చిందంటే అభిమానులకు ఫుల్లు ఫీస్టే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



