Home

»

Latest News

వర్మ సినిమాలు ఇన్స్పైర్ చేశాయట!

Jul 14, 2016 12:05PM

సినిమాలు సగటు మనుషుల మీద ప్రభావం చూపుతాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని విషయం. సినిమాలోని తమ ప్రియతమ హీరో లేదా హీరోయిన్ వేసుకొన్న బట్టలు లేదా హెయిర్ స్టైల్ ను కాపీ కొట్టడం మొదలుకొని ఆ సినిమాలోని డైలాగ్స్ ను వాళ్లలాగే చెప్పడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి సదరు సినిమాలో హీరో లేదా ఏదైనా క్యారెక్టర్ చేసిన చిలిపి కానీ సాహసకార్యాన్ని కూడా చేయాలని అనుకొంటుంటారు.

అప్పట్లో "క్షణం క్షణం" సినిమా చూసి చాలామంది బ్యాంకులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారట. అలాగే "శివ" సినిమా చూసి చాలా మంది యువకులు సైకిల్ చైన్లు తెంపడానికి ప్రయత్నించి చేతులు తెగ్గొట్టుకొన్నారు. అలాగే.. వర్మగారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఏకంగా మర్డర్లు చేశాడట ఒక సైకో. నెల్లూరుకి చెందిన సైకో వెంకటేష్ అనే వ్యక్తి మీద అయిదు హత్య కేసులతోపాటు బోలెడు మర్డర్ ఎటెంప్ట్ కేసులు కూడా ఉన్నాయి. తాను ఈ హత్యలన్నిటినీ వర్మ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యే చేశానని వెంకటేష్ పేర్కొనడం విశేషం.   

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com