Home

»

Latest News

సినిమాలకు గుడ్ బై చెప్పిన యువకథానాయకి!

Jul 14, 2016 12:45PM

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ కథానాయికగా తనకంటూ గుర్తింపు రాకపోవడం సరికదా.. ఆఫర్లు కూడా రావడం లేదని చిన్నబుచ్చుకొన్న యువకథానాయకి ఏకంగా సినిమాకు గుడ్ బై చెబుదామని ఫిక్సయిపోయింది. ఇంతకీ ఎవరా యువ కథానాయకి అని ఆలోచించేస్తున్నారా? ఆ అమ్మడు మరెవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణి రాధ కుమార్తె. నాగచైతన్య సరసన "జోష్" సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసిన కార్తీకకు ఆ సినిమా కనీస స్థాయి గుర్తింపు కూడా తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీయార్ "దమ్ము" చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ అది కూడా వృధా ప్రయత్నమే అయ్యింది. తమిళంలో నటించిన "కో" (తెలుగులో "రంగం") ఘన విజయం సాధించినప్పటికీ.. ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ మరియు హీరో ఖాతాలోనే జమ అయ్యింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా మలయాళంలో, తమిళంలో వరుస ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఒక్కటి కూడా సత్ఫలితాన్నివ్వలేకపోయింది. 

ఇక హీరోయిన్ గా మరోమారు ప్రయత్నించి భంగపడడం ఇష్టం లేని కార్తీక సినిమాలకు "గుడ్ బై" చెప్పి నటిగా సీరియల్స్ లో కొనసాగాలని నిర్ణయించుకొందట. త్వరలోనే హిందీలో రూపొందుతున్న ఓ టెలిఫిలిమ్ లో కార్తీక కనిపించనుంది. మరి అక్కడైనా అమ్మాయి కెరీర్ సక్సెస్ బాట పడుతుందో లేదో చూడాలి!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com