రేపు (జూలై 15) "సెల్ఫీ రాజా"గా ప్రేక్షకుల ముందుకురానున్న అల్లరి నరేష్ ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో "ఇంట్లో దెయ్యం నాకేం భయం" అనే మరో సినిమాలో నటిస్తున్న నరేష్ తాజాగా "అలా ఎలా" ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించాడు. ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ కథ-మాటలు సమకూరుస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
అల్లరి నరేష్ శైలి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి "మేడ మీద అబ్బాయి" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతున్న ఈ చిత్రాన్ని జాహ్నవి క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది!




