అమ్మో ఆర్జీవీ... అంత పని చేశాడా?
on May 19, 2020

ఆర్జీవీ మామూలు జీవి కాదు! మహా మేధావి!! ఎంత మేధావి కాకపోతే కరోనా కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో బందీ అయిన లాక్ డౌన్ వేళ ఒక సినిమా షూటింగ్ చేయిస్తాడు చెప్పండి? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మే మొదటి వారంలో రామ్ గోపాల్ వర్మ అండ్ టీమ్ ధైర్యంగా ఒక చిన్న ఫీచర్ ఫిలిం షూటింగ్ చేశారట. వర్మ శిష్యుడు అగస్త్య మంజు ఆ చిత్రానికి దర్శకత్వం వహించారని తెలిసింది. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఏకైక లొకేషన్ లో అతి కొద్ది మంది యూనిట్ సభ్యులతో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుని చకచకా చిత్రీకరణ పూర్తి చేశారట. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. థియేటర్ల కోసం సినిమా తీశారా? పోటీ కోసం సినిమా తీశారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
లాక్ డౌన్ లో నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ చేసిన సాహసం ఇది. దర్శకుడిగా వర్మ విషయానికి వస్తే... పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధానపాత్రలో గతంలో ఎప్పుడో తీసిన 'క్లైమాక్స్' సినిమాను ఈనెల 29న ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమా చూడాలంటే ఎవరైనా డబ్బులు కట్టాల్సిందే. 'పే పర్ వ్యూ' పాలసీ అన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



