Home

»

Latest News

మ‌రో బ‌యోపిక్ చేస్తోన్న వ‌ర్మ‌!!

Apr 1, 2019 6:24PM

 

దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత , ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ జీవితాల ఆధారంగా సినిమా తీస్తాన‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాని త‌ర్వాత ఆయ‌న ఆ సినిమా ఊసే ఎత్తులేదు. అయితే త్వ‌ర‌లోనే `శ‌శిక‌ళ‌` చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని వ‌ర్మ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ను ప్ర‌క‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. `శ‌శిక‌ళ‌` అంటూ ఓ పోస్ట‌ర్ నువిడుద‌ల చేశారు. `ప్రేమ ప్ర‌మాద‌క‌ర‌మైన రాజ‌కీయం` అని దానిపై రాశారు. మ‌రి ఇందులో న‌టీన‌టులు , సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని వ‌ర్మ వెల్ల‌డించ‌లేదు. వ‌ర్మ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్టీఆర్ , లక్ష్మీ పార్వ‌తి జీవితాల ఆధారంగా తీసిన ఈ సినిమా అనేక వివ‌దాలు ఎద‌ర్కొంది. తెలంగాణలో విడుద‌లైన ఈ సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోర్టు స్టే ఆర్డ‌ర్ వ‌ల్ల ఆగింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com