రేణూ దేశాయ్ అసలు పేరేంటో తెలుసా?
on Jul 10, 2020
పవన్ కల్యాణ్ సరసన నటించిన 'బద్'రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు రేణూ దేశాయ్. అందులో వెన్నెల క్యారెక్టర్లో రాణించారు. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లో ఆడియెన్స్ సానుభూతి సంపాదించారు. దాని తర్వాత తిరిగి పీకే సరసనే 'జాని' మూవీలో నటించారు. ఆ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. పీకేతో విడిపోయిన తర్వాత పూనేలో ఉంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు గత జ్ఞాపకాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆమె షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ తన ఇష్టాయిష్టాలను గౌరవించాలని ఆమె గట్టిగా చెబుతూనే వస్తున్నారు.
కాగా.. తన అసలు పేరు రేణూ దేశాయ్ కాదని ఆమె ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. తండ్రి పెట్టిన పేరు హీరావతి అని ఆమె తెలిపారు. ఆయన చనిపోయిన తర్వాత నానమ్మ తనపేరును రేణుకాదేవి అని మార్చిందని ఆమె చెప్పారు. ఇక సినిమాల్లోకి వచ్చాక రేణుకాదేవి పేరు కాస్తా రేణూ దేశాయ్‌గా మారిందని ఆమె వెల్లడించారు.
Also Read