Home

»

Latest News

అన్నా లెజినోవా ఆస్తులు ఎన్నో తెలుసా!

Nov 10, 2026 3:35PM

తెలుగు చలనచిత్ర రంగాన పవర్ స్టార్‌గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధినేతగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశమైంది.

పవన్ కళ్యాణ్ తన  భార్య అన్నా లెజినోవాతో 13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.


అయితే విడాకుల ప్రకటన వెలువడిన తరుణంలో అన్నాలెజినోవా ఆస్తులు, వ్యాపార సామ్రాజ్యం మరియు నెట్ వర్త్ గురించిన ఆసక్తికర విషయాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రష్యాకు చెందిన అన్నా లెజ్నెవా కేవలం ఒక నటి లేదా మోడల్ మాత్రమే కాదు, ఆమె అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త కూడా.

 

ఆమె సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హోటల్ రంగాన్ని ఎంచుకున్న అన్నా లెజ్నెవా, సింగపూర్ మరియు రష్యాలలో సొంతంగా అనేక లగ్జరీ హోటళ్లు, స్థిరాస్తులు నెలకొల్పి గ్లోబల్ బిజినెస్ ఉమెన్‌గా ఎదిగారు.

ఇది కూడా చదవండి: తొలి సినిమా హిట్టైన తర్వాత ఎందుకు ఫ్లాప్ అవుతున్నారు?..టాలీవుడ్ దర్శకుల సీక్రెట్!

వివిధ మీడియా నివేదికల అంచనాల ప్రకారం అన్నా ఆస్తుల విలువ దాదాపు 1,800 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఆ ఆస్తుల విలువ ఎంత వరకు నిజమో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం 1800 కోట్ల ఫిగర్ చక్కర్లు కొడుతూ ఉంది.

మీకు నచ్చవచ్చు: హీరోలకి పోలీసుల వార్నింగ్!
మీకు నచ్చవచ్చు: బిగ్ బ్రేకింగ్: రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్ 

 

[Anna Lezhneva Net Worth Property, Anna Lezhneva net worth, Pawan Kalyan wife divorce, Anna Lezhneva properties, Pawan Kalyan separation news, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com