Home

»

Latest News

ఆ మెగాస్టార్ తో జోడి కట్టబోతున్న రేణు దేశాయ్.. మూవీ పేరు ఇదే!  

Aug 1, 2026 11:25AM

 


రేణు దేశాయ్(Renu Desai)..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాజీ భార్య హోదాలో ఆమె పేరుకి ఎప్పుడు ఒక వైబ్రేషన్ అనేది గ్యారంటీ. సెకండ్ ఇన్నింగ్స్ లో రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావులో ప్రాధాన్యత గల క్యారక్టర్ పోషించింది.  ఆ తర్వాత ఆమె చాలా ఇంటర్వూస్ లో మాట్లాడుతు  మనసుకి నచ్చి కథకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చింది. తను చెప్పినట్టుగానే ఇప్పుడు కొత్త సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వంలో 'ఓం' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోనే రేణు దేశాయ్    కి జోడిగా చెయ్యబోతుందనే న్యూస్ ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.కేవలంపేరుకే పరిమితమయ్యే సాధారణ క్యారక్టర్ కాకుండా మొత్తం కథని కీలక మలుపు తిప్పే అత్యంత బలమైన లేడీ రోల్‌ అనే టాక్ కూడా వినిపిస్తుంది. మమ్ముట్టి ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ మరియు ఎర్రచందనం స్మగ్లర్ క్యారక్టర్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయమైతే సెల్యులాయిడ్ షేక్ అయినట్లే.    

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో కేవలం రొటీన్ పాత్రల కంటే నటనకి , సెంటిమెంట్ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న అక్క, వదిన, తల్లి లేదా కుటుంబ నేపథ్యం ఉన్న బలమైన రోల్స్ కి  విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అటువంటి మెచ్యూర్డ్ రోల్స్‌ను సమర్థవంతంగా మోయగల సీనియర్ నటీమణుల కొరత పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణంలో, రేణు దేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు రావడం టాలీవుడ్‌కి  కూడా సానుకూల పరిణామంగా భావించవచ్చు. 

Renu Desai, Mammotty, Dhanush, Om

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com