Home

»

Latest News

రాశీఖన్నా కి అరుదైన బహుమతి ఇచ్చిన స్టార్ హీరో..మనం ఎవరితో గడుపుతున్నామో తెలుసా!

Aug 1, 2026 12:03PM

 

నటిగా రాశిఖన్నా(Raashii Khanna)కి ఉన్న స్టామినాకి ఎంతో ప్రత్యేకత ఉంది. సాఫ్ట్, మాస్ రోల్స్ లో పర్ఫెక్ట్ గా చెయ్యగలదు. పాన్ ఇండియా లెవల్లో దూసుకెళ్తున్న రాశి ఖన్నా ప్రీవియస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో స్టెప్స్ వేసి అలరించింది. ప్రెజెంట్ సూపర్ స్టార్   రజనీకాంత్ 173వ ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’  లో ముఖ్యమైన క్యారక్టర్ లో చేస్తుంది.

ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.  సెట్స్‌లో రాశి ఖన్నాకి  రజనీకాంత్(RajiniKanth)అందించిన ప్రత్యేకమైన కానుక ఒకదాన్ని ఇచ్చాడు. ఆ బహుమతి చూసి రాశీ ఖన్నా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ధర్మన్’ షూటింగ్ ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే రాశీ ఖన్నాకు రజనీకాంత్‌తో మాట్లాడే అరుదైన సందర్భం లభించింది. షూటింగ్ విరామ సమయంలో వీరిద్దరి మధ్య జీవన విధానం, మనశ్శాంతి మరియు ఆధ్యాత్మికత గురించి ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఈ క్రమంలో రజనీకాంత్ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు శ్రీ స్వామి రామ రచించిన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ (Living with the Himalayan Masters) అనే ప్రముఖ గ్రంథం గురించి రాశీని అడిగారు. ఆమె ఆ పుస్తకాన్ని ఇంకా చదవలేదని చెప్పగా, సరిగ్గా రెండు రోజుల తర్వాత రజనీకాంత్ స్వయంగా ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి, తన సొంత చేతులతో రాశీ ఖన్నాకు బహుమతిగా తెచ్చి ఇచ్చారు. అంతేకాకుండా, “ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా చదువు, కొద్ది రోజుల తర్వాత నిన్ను దీనిపై టెస్ట్ చేస్తాను” అని సరదాగా అనడంతో రాశీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ మధురమైన క్షణాన్ని రాశీ ఖన్నా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. గత కొన్ని వారాలుగా ఆ పుస్తకాన్ని ఎంతో శ్రద్ధగా చదువుతున్నానని, అందులోని ప్రతి పేజీ తనను కొత్త కోణంలో ఆలోచింపజేస్తోందని ఆమె వెల్లడించారు. మనమందరం బయటి ప్రపంచపు పరధ్యానాల్లో పడి మన నిజమైన స్వభావాన్ని కోల్పోతున్నామని, ఇతరుల కోసం మారుతూ మనల్ని మనం మరిచిపోతున్నామని ఆ పుస్తకం నేర్పిన సత్యాన్ని ఆమె వివరించారు. నిశ్శబ్దం ఎందుకు అంత బిగ్గరగా వినిపిస్తుందో, మనతో మనం గడపడం ఎంత అవసరమో ఈ పుస్తకం ద్వారా అవగాహన చేసుకున్నానని రాశీ ఖన్నా పేర్కొన్నారు.  రజనీకాంత్ కి ఆధ్యాత్మికతపై ఎంతటి గాఢమైన అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 


Also read: ఆ మెగాస్టార్ తో జోడి కట్టబోతున్న రేణు దేశాయ్.. మూవీ పేరు ఇదే  


ఇక సినిమా విషయానికి వస్తే, యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ రూపుదిద్దుకుంటోంది. విశ్వనటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రోక్స్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, సీనియర్ నటి సిమ్రాన్ మరియు రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా లేదా సమ్మర్ రేసులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్రణాళికలు వేస్తోంది.

 

Rajinikanth, Raashii Khanna, Ashwath Marimuthu, Kamal Haasan

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com