లవ్‌లో రేణు దేశాయ్.. ఎవరితోనంటే...
on Jan 27, 2021
'బద్రి', 'జాని' సినిమాల్లో కలిసి నటించిన పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కొంత కాలం సహజీవనం చేసి 2009లో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. వారికి అకిర నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత మూడేళ్లకు, అంటే 2012లో అధికారికంగా విడిపోయారు. పవన్ రష్యన్ వనిత అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. రేణు మాత్రం తన ఇద్దరు పిల్లలతో పూణేకు వెళ్లిపోయి సింగిల్ మదర్‌గా వారిని పెంచుతూ వస్తున్నారు. పిల్లల కోసం పవన్ అప్పుడప్పుడు పూణేకు వెళ్లి వస్తుంటారు. అదేవిధంగా పిల్లలూ హైదరాబాద్‌లో తండ్రిని కలిసేందుకు వస్తున్నారు. ఇటీవల రేణుకు నటిగా సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి. దాంతో తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్తున్నారు.
గతంలో ఓసారి తాను మరలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు రేణు వెల్లడించినప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అదే ఫ్యాన్స్ అంతకుముందు పవన్ మళ్లీ పెళ్లిచేసుకుంటే కిమ్మనకుండా ఉండిపోయారు. అంటే పెళ్లి విషయంలో ఆడవాళ్లకు ఓ రూల్, మగవాళ్లకు ఇంకో రూల్ అన్నట్లు ఆ ఫ్యాన్స్ ప్రవర్తించారు.
కాగా, తను ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు రేణు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆమె ప్రేమలో పడింది మనిషితో కాదు, ఓ పెంపుడు కుక్కతో. దాని పేరు ప్లూటో. సోషల్ మీడియా ద్వారా ఈ విషయంలో అనౌన్స్ చేశారు రేణు. ప్లూటో ఫొటోను షేర్ చేసి, "ఐ యామ్ అఫిషియల్లీ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్" అంటూ రాసుకొచ్చారు. రేణు మంచి జంతు ప్రేమికురాలు. ఆమె ఇంట్లో పిల్లులు, కుక్కలు సరదాగా ఆడుకుంటూ ఉంటాయి.