Home

»

Latest News

రెజీనాకి టాలీవుడ్ తలుపులు మూసినట్లేనా..?

Oct 18, 2016 12:53PM

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మంచి హిట్ పడి అదే జోష్ కంటిన్యూ చేస్తే ఐదేళ్లు లేదంటే మరో రెండేళ్లు అంతే. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నంతలో ఎడాపెడా సినిమాలు చేస్తుంటారు కథానాయికలు. ఎస్ఎంఎస్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది రెజీనా..కళ్లు, స్మైల్‌తో ఫ్యాన్స్‌ని గిలిగింతలు పెట్టడంతో పాటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

ఇప్పటి వరకు చిన్న హీరోలు తప్ప స్టార్ హీరోతో ఒక్కసినిమా కూడా పడలేదు రెజీనాకి. అయితే అప్పుడే ఈ అమ్మడిపై టాలీవుడ్‌కి మోజు తీరిపోయినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన "జ్యోఅచ్యుతానంద" తర్వాత రెజీనాకు ఎలాంటి ఛాన్స్ రాలేదు. దానికి తోడు తాను లేడీ ఓరియెంటేడ్ మూవీస్ చేస్తానని రెజీనా స్వయంగా ప్రకటించింది. ఏ హీరోయిన్ అయినా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తానని వాళ్లంతట వాళ్లే చెప్పారంటే సదరు హీరోయిన్‌కి అవకాశాలు రావటం లేదనే అర్థం. పాపం రెజీ..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com