Home

»

Latest News

ఎన్టీఆర్ క‌థ‌తో...చైతూ సినిమా

Oct 18, 2016 3:15PM

ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల‌ని రైట‌ర్ వ‌క్కంతం వంశీ ఓ క‌థ రెడీ చేసుకొని రెండేళ్ల నుంచీ తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే... ఈ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఎన్టీఆర్ ఈ స్క్రిప్టును ప‌క్క‌న పెట్టాడు. ఎన్టీఆర్ `నో` చెప్ప‌డంతో వంశీ మ‌రో హీరోని వెదుక్కోక త‌ప్ప‌లేదు. ఇప్పుడు ఈ క‌థ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని టాక్‌. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది.  

కృష్ణ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఆ క‌థ‌.. వ‌క్కంతం వంశీదే అని స‌మాచారం. నిజానికి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌మ‌ని వంశీనే అడిగార‌ట‌. అయితే.. వంశీకి మ‌రో కమిట్‌మెంట్ ఉండ‌డంతో ఆ ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు టాక్‌. ఎన్టీఆర్ శైలి వేరు.. నాగ‌చైత‌న్య స్టైల్ వేరు. మ‌రి ఎన్టీఆర్ కోసం రాసుకొన్న క‌థ చైతూకి ఎలా స‌రిపోతుందో చూడాలి. ప్రేమ‌మ్ త‌ర‌వాత చైతూ... క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అది పూర్త‌య్యాకే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com