డిఫరెంట్ గా వస్తున్న రవితేజ...
on Aug 12, 2017
.jpg)
మాస్ మహారాజా రవితేజ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘రాజా ది గ్రేట్’ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుండి షూటింగ్ ప్రారంభమైన ఈసినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేశారు. అయితే ఈసినిమాలో రవితేజ కాస్త డిఫరెంట్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఆగష్ట్ 15 న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని ట్వీట్ చేశాడు. కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ కథానాయిక నటిస్తున్నారు.. ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



