'వీర' డైరెక్టర్‌తో మరోసారి!
on Jan 25, 2020
జనవరి 24న విడుదలైన 'డిస్కో రాజా' మూవీ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో 'క్రాక్' సినిమా చేస్తోన్న రవితేజ, మరొ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదివరకు తనతో 'వీర' సినిమాని తీసిన రమేశ్‌వర్మ డైరెక్షన్‌లో మరో మూవీని చేయబోతున్నాడు. రమేశ్‌వర్మతో ఇటీవల 'రాక్షసుడు' వంటి హిట్ థ్రిల్లర్‌ను తీసిన ఏ స్టూడియోస్ అధినేత కోనేరు సత్యనారాయణ ఈ మూవీని నిర్మించనున్నారు.
జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందించనున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ మూవీలో నటించే హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. 'వీర' సినిమా ఫ్లాపైనా, రమేశ్‌వర్మ చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చి, మళ్లీ అతని డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు రవితేజ.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
