అవును.. రవితేజకు డ్రగ్స్ అందించా..!
on Jul 27, 2017

డ్రగ్స్ కేసు వ్యవహారంలో నోటీసులు అందుకున్న సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా సిట్ విచారణలో పాల్గొంటున్నారు. ఇక ఈరోజు సిట్ విచారణలో పాల్గొన్న ముమైత్ ఖాన్ విచారణ కూడా ముగిసింది. దాదాపు ఆరుగంటల పాటు ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు ప్రశ్నించారు. పూరీకి, ఆమెకు ఉన్న సంబంధాలు.. డ్రగ్స్ వాడకం.. ఇలా పలు రకాల ప్రశ్నలు వేసి ఆమెను ఇరకాటంలోనే పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఇక రేపు రవితేజ వంతు. అయితే అందరి కంటే రవితేజ విచారణపై అందరికి ఆసక్తి పెరిగింది. దీనికి తోడు మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. కాల్విన్, డ్రగ్ సరఫరాదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జిషాన్ విచారణలో పలు అంశాలు వెలుగుచూశాయి. జిషాన్, రవితేజకు ఆరేళ్లుగా పరిచయం ఉందని... రవితేజకు కాల్విన్ ను పరిచయం చేసింది జిషాన్ అని తెలిసింది. అంతేకాదు.. రవితేజకు డ్రగ్స్ ను సరఫరా చేసినట్టు జిషాన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వార్తల నేపథ్యంలో రవితేజ విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. ఎలా రవితేజ నుండి నిజాలు రాబడతారు.. అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక రవితేజ విచారణ కేసుకు కీలకంగా మారనుందని అని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



