తమన్ ను వదలని రవితేజ
on Feb 21, 2016

రవితేజకు కెరీర్ టర్నింగ్ హిట్ గా కిక్ గురించి చెప్పుకోవచ్చు. డల్ గా ఉన్న రవి కెరీర్, కిక్ సినిమా నిజంగానే మాంఛి కిక్ ఇచ్చింది. దాంతో అప్పటి నుంచి మాస్ రాజాకు సెంటిమెంట్ గా మారిపోయాడు కిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్ పై ఎన్ని విమర్శలు వచ్చినా, వదలకుండా తన సినిమాలకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టే, తమన్ కూడా మాస్ రాజా సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తూ తన వాల్యూ చాటుకుంటున్నాడు. కిక్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వరసగా ఆంజనేయులు, మిరపకాయ్, వీర, నిప్పు, బలుపు, పవర్, కిక్ 2 సినిమాలు వచ్చాయి. తాజాగా కొత్త డైరెక్టర్ చక్రి తోలేటి డైరెక్షన్లో రాబోతున్న రాబిన్ హుడ్ సినిమాకు కూడా తమన్ నే రవితేజ ఎంచుకున్నాడట. ఈ సినిమా డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోతోంది. ఏమైనా ఈ కాలంలో ఒక హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వరసగా తొమ్మిది సినిమాలు రావడమంటే విశేషమే మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



