Home

»

Latest News

'ఇరుముడి' సెకండ్ సాంగ్.. రవితేజను ఇలా ఎప్పుడూ చూసుండరు.!

Aug 3, 2026 12:52PM

మాస్ మహారాజా రవితేజ అప్ కమింగ్ మూవీ 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 'ఇరుముడి' నుంచి విడుదలైన ప్రతి కంటెంట్ మెప్పించింది. ముఖ్యంగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'ఇరుముడి కట్టు' సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు 'యాలాలో యాలాలో' అంటూ సెకండ్ సింగిల్ విడుదలైంది. 

'ఇరుముడి' నుంచి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ అండ్ మెలోడియస్ సాంగ్ విడుదలైన 'యాలాలో యాలాలో' ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. చిన్న కుటుంబంలోని క్యూట్ మూమెంట్స్ ను కాప్చర్ చేస్తూ ఈ సాంగ్ ను తెరకెక్కించారు. తల్లిదండ్రులు, కూతురు మధ్య సన్నివేశాలు కట్టిపడేశాయి. 

జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన హృద్యమైన సంగీతం, అనంత శ్రీరామ్ అద్భుత సాహిత్యం, హేషమ్ అబ్దుల్ వహాబ్, సాధికా కె.ఆర్ ఆత్మీయ గాత్రం.. ఈ పాటను ఒక మ్యాజికల్ మెలోడీగా మార్చాయి.

"యాలాలో యాలాలో ఎన్నెన్నో ముచ్చటలో.. అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం.. చూడాలి ఈ లోకం" అంటూ సాగే ప్రతీ లైన్ కూడా మన కుటుంబ సంబంధాల విలువను, ఆప్యాయతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ఇంతటి అద్భుతమైన ఎమోషన్‌ను తనదైన స్టైల్‌లో తెరకెక్కించడంలో దర్శకుడు శివ నిర్వాణ మరోసారి తన మార్క్ చూపించారు. 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి చిత్రాలతో ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట అనిపించుకున్న శివ నిర్వాణ, ఈ 'ఇరుముడి' చిత్రంలో రవితేజతో ఎలాంటి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాను ఆవిష్కరించబోతున్నారో ఈ ఒక్క పాటతో స్పష్టమవుతోంది.

 

 

Ravi Teja, Irumudi Second Single, Yaalalo Yaalalo Song, Shiva Nirvana, GV Prakash

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com