
ప్రస్తుత రోజుల్లో ఎవరి ఆనందం వాళ్ళది. కాబట్టి వాళ్ళ ఆనందాన్ని విమర్శించడానికి ఎవరకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఇప్పుడు బుల్లి తెర హీరోయిన్ 'బ్రహ్మముడి’ ఫేమ్ దీపిక రంగరాజు విషయంలో పైన చెప్పుకున్న మాట అక్షరాలా సత్యమని ఒప్పుకోవాల్సిందే. అచ్చమైన తెలుగమ్మాయిగా, తన సహజసిద్ధమైన నటనతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దీపిక రంగరాజు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన రహస్యాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన కెరీర్ ఎంపికల్లో జ్యోతిష్యం వహించిన పాత్ర గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సందిగ్ధత ఏర్పడుతుంది. బ్రహ్మముడి సీరియల్ ప్రారంభానికి ముందు ఒకేసారి రెండు వేర్వేరు ప్రాజెక్టుల నుండి అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ఇప్పటికే నడుస్తున్న ఒక హిట్ సీరియల్‌లో హీరోయిన్ రీప్లేస్‌మెంట్ ప్రాజెక్ట్ కాగా, మరొకటి సరికొత్తగా ప్రారంభం కాబోతున్న ఒక కొత్త సీరియల్ ప్రాజెక్ట్. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే నా భవిష్యత్తు బాగుంటుందో తెలియక తీవ్ర మనోవేదనకి, సందిగ్ధానికి గురయ్యాను. ఆ సమయంలోనే జ్యోతిష్యులని సంప్రదించాను
ఫోన్ అపాయింట్‌మెంట్లు తీసుకొని, జాతకాలను విశ్లేషింపజేసుకోవడానికి నెలకు దాదాపు రూ. 10,000 వరకు ఖర్చు చేసేదాన్నీ. జాతక సలహాల కోసమే అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ, ఆమె సంప్రదించిన ఎక్కువ మంది జ్యోతిష్యులు రీప్లేస్‌మెంట్ ప్రాజెక్ట్ వద్దని, సరికొత్త సీరియల్‌నే ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. జ్యోతిష్యుల సూచనల మేరకు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం ‘బ్రహ్మముడి’ ఎంచుకున్నాను.
Also read: వెలుగులోకి రామాయణ సీక్రెట్..ఆ రాష్ట్రంలోని ప్రాగ్జ్యోతిష్యపురంతో రాముడికి ఉన్న లింక్ ఏంటి?
జ్యోతిష్యులు చెప్పిన ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్నే మార్చివేసింది. ‘బ్రహ్మముడి’ సీరియల్ బుల్లితెరపై విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన ప్రజాదరణ పొందింది. అంతేకాకుండా దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల క్రితమే ఒక నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత నా కెరీర్‌లో ఊహించని వెలుగులోకి వస్తానని ఒక జ్యోతిష్యుడు చెప్పారు. సరిగ్గా బ్రహ్మముడి సీరియల్‌తో ఆ జ్యోతిష్యుడి మాటలు నూటికి నూరు శాతం నిజమయ్యా యి. గతంలో కూడా వారు చెప్పిన అనేక విషయాలు నా నిజ జీవితంలో అక్షరాలా ఫలించాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలతో జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళకి ఎక్కడా లేని హుషారు రావడం గ్యారంటీ.
Deepika Rangaraju, Astrology
.webp)





