'వాల్తేరు వీరయ్య' నుంచి మాస్ మహారాజ్ ఫస్ట్ లుక్!
on Dec 9, 2022
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న 'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, 'బాస్ పార్టీ' సాంగ్ లో మెగాస్టార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రవితేజ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
'వాల్తేరు వీరయ్య' నుంచి రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ని డిసెంబర్ 12న ఉదయం 11:07కి విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ తాజాగా మూవీ టీమ్ ఆయన ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది. ఒక చేతిలో మేకపిల్లను పట్టుకొని, మరో చేత్తో గొడ్డలి పట్టుకొని గ్యాస్ సిలిండర్ ను లాక్కొస్తున్న రవితేజ ప్రీ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.