రవితేజ, ధనుష్ చిత్రాలతో.. మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడా!
on Jan 3, 2022

స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడిగా పరిచయమైనా.. అనతి కాలంలోనే సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు జీవీ ప్రకాశ్ కుమార్. వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ.. వెర్సటైల్ కంపోజర్ అనిపించుకున్నాడు ప్రకాశ్. కేవలం తమిళంకే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లోనూ తన బాణీ పలికించాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక తెలుగునాట అనువాదాలతో ప్రకాశ్ ప్రయాణం ప్రారంభమైనా.. ఆపై `ఉల్లాసంగా ఉత్సాహంగా`, `డార్లింగ్`, `ఎందుకంటే ప్రేమంట`, `ఒంగోలు గిత్త`, `జెండాపై కపిరాజు`తో నేరుగా ఇక్కడ సందడి చేశాడు. వీటిలో `ఉల్లాసంగా ఉత్సాహంగా`, `డార్లింగ్` చిత్రాలు.. ప్రకాశ్ ఖాతాలో విజయాలను జమచేశాయి.
ఇదిలా ఉంటే.. దాదాపు ఏడేళ్ళ తరువాత తెలుగులో సినిమాలు చేస్తున్నాడు ప్రకాశ్. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా బహుభాషా చిత్రాలే. వాటిలో ఒకటి మాస్ మహారాజా రవితేజ నటించనున్న పాన్ - ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు` కాగా, మరొకటి కోలీవుడ్ స్టార్ ధనుష్ బైలింగ్వల్ మూవీ `సార్` (తమిళంలో `వాతి`). మరి.. రవితేజ, ధనుష్ వంటి స్టార్స్ కాంబినేషన్ లో ప్రకాశ్ చేస్తున్న ఈ చిత్రాలు.. తెలుగునాట అతన్ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తాయేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



