Home

»

Latest News

మీర్జాపూర్ భామ వ్యాఖ్యలు వైరల్: టాలెంట్ ఉంటే చాలదు.. అలా అనిపిస్తే అవకాశం

Sep 15, 2026 11:30AM

 


ప్రెజెంట్ థియేటర్స్ లో  'మీర్జాపూర్' సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.  పూనకాలు వచ్చిన వాళ్ళల్లా ప్రేక్షకులు థియేటర్స్ కి తరలి వెళ్తున్నారు. కొంత ముందైతే సినిమా అయిపోయినా కూడా తమ సీట్స్ లో నుంచి అయిష్టంగా లేచి వెళ్తున్నారంటే మీర్జాపూర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 4 న థియేటర్స్ లోకి అడుగుపెట్టగా కేవలం పదిరోజులకే వరల్డ్ వైడ్ గా 266 కోట్ల గ్రాస్ వసూలు చేసి 'హనుమాన్ అంష్' రికార్డ్స్  కి ఎప్పటికప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తూ వస్తుంది.

ఇక  మీర్జాపూర్ లో బీనా త్రిపాఠి క్యారక్టర్ లో అద్భుతమైన పెర్ఫార్మ్ చేసి మెస్మరైజ్ చేసిన నటి రసిక దుగ్గల్. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జీవితంలో కొన్ని సార్లు ప్రతిభ కంటే వ్యాపారాత్మక అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని సార్లు కళాత్మక ప్రతిభ కూడా ముఖ్యం, ఒక నటి, నటుడు పని పెరుగుతున్న కొద్దీ దర్శక, నిర్మాతల్లో వారిపై నమ్మకం ఏర్పడుతుంది.ఆ విధంగా తమ ప్రాజెక్ట్ కి పనికొస్తాడని అనుకున్నప్పుడే కాస్టింగ్ జరుగుతుంది అలా అనిపించకపోతే అవకాశం ఇవ్వరు. ఈ విషయంలో మంచి నటులు, నటీమణులు ఎంపిక కానప్పుడు బాధేస్తుంది. అందుకే ప్రతిభ టాలెంట్ ఉన్నంత మాత్రాన అవకాశాలు దక్కుతాయని చెప్పలేమని 'బీనా రసిక 'చెప్పుకొచ్చింది.

 

 


Also Read: పగోడికి కూడా ఈ బాధ రాకూడదు. టాక్సిక్ ప్రొడ్యూసర్ వరుస మూడో ప్లాప్!

జార్ఖండ్ కి చెందిన రసిక 2007 లో 'అన్వర్' అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి నో స్మోకింగ్, ఔరంగజేబు, బాంబే టాకీస్, ఒన్స్ అగైన్, కర్తవ్య ఇలా సుమారు 20 చిత్రాల వరకు ప్రాధాన్యత గల రోల్స్ పోషించి మెప్పించింది.

 

 

 

[Rasika Dugal, Mirzapur, Guarantee Opportunities,Rasika Dugal Movies, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com