Home

»

Bollywood News

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పిఏ డెత్ కేసు: మౌనం వీడిన  సూరజ్..నిజంగా హీరోనేనా!

Sep 15, 2026 12:15PM

 

 

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ 'దిశా సాలియాన్' మరణం కేసు మళ్ళీ సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో బొంబాయి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కొత్తగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసింది. సెప్టెంబరు 14, 2026న సీబీఐ నమోదు చేసిన ఈ ఎఫ్‌ఐఆర్‌లో శివసేన (UBT) నేత ఆదిత్య థాక్రే, నటుడు సూరజ్ పంచోలీ, డినో మోరియా, రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తిలతో పాటు ఇతర ప్రముఖుల పేర్లు రావడం  తీవ్ర సంచలనానికి దారితీసింది. కేసు మళ్ళీ మొదటికి రావడం, అందులో తన పేరు కూడా ప్రస్తావనకి రావడంతో  సూరజ్ పంచోలీ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు.


 సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'దిశా సాలియాన్ మరణించి ఇన్నేళ్లవుతున్నా, ఏ సంబంధం లేకపోయినా నా పేరును పదేపదే  వివాదంలోకి లాగడం నన్ను ఎంతో వేదనకు గురిచేస్తోంది. నేను నా జీవితంలో దిశా సాలియాన్‌ను నేరుగా కానీ, పరోక్షంగా కానీ ఎప్పుడూ కలవలేదు. అంతేకాకుండా రాజకీయ నాయకుడు ఆదిత్య థాక్రేతో కూడా నాకేమి పరిచయం లేదు. ఆయన్ని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. ఇప్పటివరకు మీడియా వార్తలను, ఊహాగానాలను పట్టించుకోకుండా ఊరుకున్నాను. కానీ తప్పు చేయనప్పుడు మౌనంగా ఉండటం సరికాదని మాట్లాడుతున్నాను. గతంలోనే ఈ కేసుకు సంబంధించి దాదాపు 4 నుంచి 5 ఏళ్ల క్రితమే నా స్టేట్‌మెంట్‌ని  ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రికార్డు చేసాయి. నా వద్ద దాచడానికి ఏమీ లేదు. నిజాన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి హెడ్‌లైన్ లేదా టీవీ డిబేట్‌ను నిజమని నమ్మకండి. హెడ్‌లైన్లు ఎప్పటికీ సాక్ష్యాలు కావు" అని నెటిజన్లను కోరారు.

 

 


Also Read: మీర్జాపూర్ భామ వ్యాఖ్యలు వైరల్: టాలెంట్ ఉంటే చాలదు.. అలా అనిపిస్తే అవకాశం


 సూరజ్ పాంచోలి  విషయానికి వస్తే నటుడు ఆదిత్య పాంచోలి, నటి జరీనా వాహబ్ ల కుమారుడే సూరజ్ పాంచోలి. 2015 లో సల్మాన్ ఖాన్  ప్రొడ్యూసర్ గా  వచ్చిన 'హీరో' మూవీతో తెరంగ్రేటం చేసాడు. ఇక దిశా సాలియాన్ 2020 జూన్ 9వ తేదీన ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఒక భవంతిలోని 12వ అంతస్తు నుంచి కిందపడి అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ ఘటన జరిగిన సరిగ్గా 5 రోజుల వ్యవధిలోనే, అంటే 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన నివాసంలో మరణించడం బాలీవుడ్ వ్యాప్తంగా పలు ఊహాగానాలకి తావు ఇస్తుంది.

 

 

 

[Sooraj Pancholi, Disha Salian Death Case, CBI, sushant singh rajput, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywoodm Bollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com