Home

»

Bollywood News

బ్లాక్‌బ‌స్ట‌ర్ 'హనుమాన్ అంశ్' డైరెక్ట‌ర్ నెక్స్‌ట్ మూవీ ఇదే.. పెరిగిన ఎక్స్‌పెక్టేష‌న్స్‌.!

Sep 15, 2026 9:24AM

బాబా నీమ్ కరోలి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజ‌యం సాధించి కోట్లలో కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం సృష్టించిన అపూర్వ విజయం తర్వాత, దర్శకుడు విశాల్ చతుర్వేది మరో అద్భుతమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. భక్తి, ఆధ్యాత్మికత నేపథ్యంలో మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు.

ఈసారి భారతీయ చరిత్రలోని ప్రముఖ కవి, ఆధ్యాత్మిక దిగ్గజం మహాకవి గోస్వామి తులసీదాస్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ నూతన సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి రామ్ బోలా (RamBola - The Immortal Story of Goswami Tulsidas) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మహాభారతీయ సాంప్రదాయం, సనాతన ధర్మం ఉట్టిపడేలా ఈ కథను వెండితెరకు ఎక్కించబోతున్నారు.

మహావీర్ జైన్ ఫిలిమ్స్ పతాకంపై మహావీర్ జైన్, విశాల్ చతుర్వేది,  రఘువేంద్ర సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హనుమాన్ అంశ్' విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి అంత కంటే గొప్ప స్థాయిలో తులసీదాస్ జీవన ప్రయాణాన్ని చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. తులసీదాస్ చిన్ననాటి నుంచి ఆయన మహాకవిగా ఎదిగే క్రమంలోని ఆధ్యాత్మిక రహస్యాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.

ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది. త్వరలోనే నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మహాకవి తులసీదాస్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. 'హనుమాన్ అంశ్' లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుందని అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

 

 

[Vishal Chaturvedi, RamBola Movie, Tulsidas Biography, Hanuman Ansh Success, Mahaveer Jain Films]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com