రష్మిక ఒప్పుకున్న కొత్త మూవీ ఎలాంటిదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. నేషనల్ క్రష్ కదా
on Jun 26, 2025
స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna)రీసెంట్ గా 'కుబేర'(Kuberaa)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కుబేర సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతు రష్మిక నటన చూస్తే క్షణం క్షణం సినిమాలో 'శ్రీదేవి' ని చూసినట్టుగా ఉందని చెప్పాడు. దీన్ని బట్టి రష్మిక నటనకి ఉన్న స్థాయిని అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా రష్మిక ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'సీతారామం' ఫేమ్ 'హను రాఘవపూడి'(Hanu Raghavapudi)దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన రవీంద్ర(Ravindra)అనే వ్యక్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రవీంద్ర చెప్పిన కథ రష్మిక కి నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. టైటిల్ రేపు అనౌన్స్ చేస్తామని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో చేతిలో పొడవాటి బల్లెంతో రష్మిక ఒక అడవిలో ఉంది. పక్కనే ఒక చెట్టు కాలుతూ ఉంది. ఇప్పుడు ఈ ఒక్క పోస్టర్ సినిమా స్టోరీ ఏమై ఉంటుందనే ఆసక్తిని కలిగిస్తుంది. సినిమాకి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా రేపు తెలిసే అవకాశం ఉంది.
రష్మిక ఇప్పటికే చిలసౌ ఫేమ్ 'రాహుల్ రవీంద్రన్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl friend)లో చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
