కన్నప్ప యూఎస్ రిపోర్ట్.. హిట్టా ఫట్టా..?
on Jun 26, 2025
ఎట్టకేలకు కన్నప్ప థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమాపై మొదట్లో బాగా నెగటివ్ ఉండేది. సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచెం కొంచెం పాజిటివ్ గా మారుతూ వచ్చింది. సినిమాలో ఏదో విషయం ఉందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగేలా చేసింది. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్ రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయి. (Kannappa)
యూఎస్ లో కన్నప్ప మొదటి షో పూర్తయింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటున్నారు. ప్రారంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సీన్స్ అంతగా మెప్పించలేకపోయాయి. కానీ, అసలు కథలోకి వెళ్ళాక మాత్రం కట్టిపడేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ హైలైట్. మంచు విష్ణు తన పర్ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేశాడని.. ఇక ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ల అతిథి పాత్రలు సినిమాని నిలబెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళాడు. అలాగే సంగీతం కూడా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందని చెబుతున్నారు.
మొత్తానికి ఫస్ట్ హాఫ్ ను కాస్త ఓపికగా చూస్తే, సెకండ్ హాఫ్ నచ్చేస్తుందని.. ముఖ్యంగా శివ భక్తులకు ఈ సినిమా నచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో కూడా పాజిటివ్ టాక్ వచ్చి.. శివభక్తులు, ప్రభాస్ అభిమానులు ఈ సినిమాని భుజానికెత్తుకుంటే.. మంచి వసూళ్లు వస్తాయి అనడంలో సందేహం లేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
