కన్నప్ప పై మంచు మనోజ్ పాజిటివ్ ట్వీట్.. కానీ ఆ ఒక్కటి తప్ప
on Jun 26, 2025
మంచు విష్ణు(Manchu Vishnu)మోహన్ బాబు(Mohan Babu)కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'(kannappa)రేపు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(Mohan Lal)అక్షయ్ కుమార్(Akshay Kumar)శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రచార చిత్రాలతో కన్నప్ప పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. రీసెంట్ గా కన్నప్ప గురించి మోహన్ బాబు రెండవ కుమారుడు ప్రముఖ హీరో 'మంచు మనోజ్'(Manchu Manoj)ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
తన ట్వీట్ లో 'నా తండ్రి మోహన్ బాబు 'కన్నప్ప' కోసం సంవత్సరాల తరబడి తన కష్టాన్ని,ప్రేమని వెచ్చించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. మా చిన్నారులు అరియనా, విరియానా, అవ్రం బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. వారిని చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. తనికెళ్ళ భరణి గారి జీవిత కల నెలవేరబోతుంది.ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా ఇలా కన్నప్పని సపోర్ట్ చేసిన వాళ్ళకి కృతజ్నత తెలపాలని అనుకుంటున్నాను. వీళ్లందరు స్క్రీన్ పై చేసే మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్నాను. శివుడు ఈ జర్నీని ఆశీర్వదించాలని కన్నప్ప కి సంబంధించిన మోహన్ బాబు, విష్ణు కుమార్తెలు, కొడుకు పిక్స్ ని కూడా షేర్ చేసాడు. ఆయన సోదరుడు కన్నప్ప గా టైటిల్ రోల్ పోషిస్తున్న విష్ణు గురించి చెప్పడంగాని ఫోటో షేర్ చెయ్యడం గాని చెయ్యలేదు
గత కొంతకాలంగా తిరుపతి(Tirupati)లో ఉన్న మంచు మోహన్ మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కన్నప్ప మూవీ 'తిన్నడు' అనే బోయవాడు శ్రీకాళహస్తి సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో వేటని తన వృత్తిగా చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడి మరో రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడ్ని నమ్మాడు. కానీ ఆ తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడి కి పరమ భక్తుడైన కన్నప్పగా మారతాడు. ఈ పాయింట్ తోనే కన్నప్ప కథ తెరకెక్కింది. ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకత్వంలో మోహన్ బాబు, విష్ణు 200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
