విషాదాంతమైన హీరోయిన్ జీవితం.. ఆ బయోపిక్‌లో రష్మిక మందన్న?
on Dec 9, 2025
- 4 సంవత్సరాల్లో కేవలం 11 సినిమాలు
- 20 ఏళ్ళ వయసులోనే మృత్యువు ఒడిలోకి
- ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీయే!
సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా నటీనటులుగా ఛాన్సులు రావాలన్నా, అందులో రాణించాలన్నా ఎంతో టాలెంట్, కృషి, పట్టుదల ఉండాలి. వీటన్నింటికీ అదృష్టం కూడా తోడైతే వారి కెరీర్‌కి తిరుగుండదు. కొందరు చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నా వారికి అరకొర అవకాశాలు వస్తుంటాయి. వాటితో తమని తాము నిరూపించుకునే వీలుండదు. మరికొందరు ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
Also Read: తీవ్రంగా గాయపడ్డ యాక్టర్ రాజశేఖర్.. మూడు గంటలపాటు సర్జరీ
అలా ఇండస్ట్రీకి వచ్చిన నటి ప్రత్యూష. చాలా తక్కువ టైమ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకొని, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులోనే కాదు, తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నాలుగు సంవత్సరాల్లో కేవలం 11 సినిమాలు మాత్రమే చేసి అందరి అభిమాన నటి అయిన ప్రత్యూష జీవితం విషాదాంతమైంది. 20 ఏళ్ళ వయసులోనే తనువు చాలించి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని వేదనకు గురిచేసింది. చక్కని మొహం, చెరగని చిరునవ్వు, ఆకట్టుకునే నటన.. మంచి నటికి ఉండాల్సిన లక్షణాలన్నీ కలబొసిన ప్రత్యూష మరణానికి కారణాలు ఏమిటి? అనేది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది.
సినిమాను తలపించే ఆమె జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి, మరెన్నో సంఘర్షణలు ఉన్నాయి. అలాంటి నటీమణి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ప్రత్యూష జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని టాప్ స్టార్‌గా కొనసాగుతున్న రష్మిక మందన్న ఈ బయోపిక్‌లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పవన్ పై జయసుధ కీలక వ్యాఖ్యలు.. ఆ పార్టీలో చేరుతుందా!
ప్రత్యూష బయోపిక్‌కి సంబంధించి రష్మిక పేరే వినిపించడానికి ప్రధాన కారణం.. వీరిద్దరికీ దగ్గర పోలికలు ఉండడమే. ఆమె కళ్లు, అమాయకత్వంతో కూడిన చిరునవ్వు.. ఇవన్నీ ప్రత్యూష క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. అందులోనూ రష్మిక ఏ క్యారెక్టర్‌లోనైనా ఇన్‌వాల్వ్ అయి నటించే హీరోయిన్ కావడం కూడా ఆమె పేరు వినిపించడానికి కారణమవుతోంది. ప్రత్యూష జీవితంలో ఎన్నో చీకటి వెలుగులు ఉన్నాయి. వాటన్నింటినీ తన నటనతో ఆవిష్కరించగల రష్మిక ఈ క్యారెక్టర్‌కి ఒన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా చెబుతున్నారు. ఈ బయోపిక్‌కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలను బట్టి త్వరలోనే ఎనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



