నిద్రలేని రాత్రులు అసలు వద్దంటున్న క్రష్
on Mar 18, 2023
రష్మిక ఏం చెప్పినా ఆథంటిక్‌గా చెబుతారు. రీసెంట్‌గా నిద్ర గురించి ఆమె పెట్టిన పోస్టు గురించి కూడా జనాలు ఈ విషయాన్నే మాట్లాడుకుంటున్నారు. సమయం దొరికితే నిద్రపోండి. మనుషులకు ఎనిమిది గంటల సేపు నిద్ర చాలా కీలకం. ఎవరి కోసమూ నిద్ర మానుకోవద్దు. ఎవరూ మీ నిద్రను డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. అది ఎవరికైనా చాలా ముఖ్యం అని అంటున్నారు రష్మిక మందన్న. లేటెస్ట్ గా నిద్ర ముఖంతో ఉన్న పోస్టు పెట్టారు రష్మిక.
ఉన్నట్టుండి నిద్ర గురించి అన్ని విషయాలను ఎందుకు చెప్పారన్నదే ఇప్పుడు ఎవరికీ అర్థం కాని విషయం. రీసెంట్‌గా మరాఠా ఛానెల్‌కి ఓ ప్రోగ్రామ్ చేశారు రష్మిక. మరాఠీ జానపద నృత్యం లవణిని నేర్చుకుని, ఆ కాస్ట్యూమ్స్ లో ఆమె పెర్ఫార్మ్ చేసిన తీరు చూసి ఫిదా అయ్యారు జనాలు. ఇంత ఆథంటిక్‌గా చేయబట్టే, ఆమె కెరీర్ గ్రాఫ్ పైపైకి చూస్తోందని కితాబిస్తున్నారు. కిరాక్ పార్టీలో నటించిన అమ్మాయికి, ఇప్పుడు ప్యాన్ ఇండియా ఆర్టిస్టుగా ఎదుగుతున్న రష్మికకు అసలు పోలికే లేదంటున్నారు క్రిటిక్స్. ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ని, వెస్టర్న్ స్టైల్స్ ని నేర్చుకోవడం, విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందడానికి ప్రయత్నించడం వంటి లక్షణాలను యువత రష్మికను చూసి నేర్చుకోవాలని అంటున్నారు.
మరాఠీ జానపద నృత్యానికి శ్రీవల్లి పాట స్టెప్పులు వేసి మెప్పించారు రష్మిక. ఈ ఫుల్ వీడియో ఈ నెలాఖరున అక్కడి చానళ్లలో ప్రసారం కానుంది. ఆల్రెడీ తెలుగులో స్పష్టంగా మాట్లాడుతారు రష్మిక. ఈ మధ్య తమిళ్ కూడా నేర్చుకున్నారు. హిందీ సినిమాల్లోనూ ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు కూడా ఆమెకు చేతినిండా సినిమాలున్నాయి. ఈ ఏడాది రష్మిక నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. వారసుడు తెలుగు తమిళ్‌లో విడుదలైంది. మిషన్ మజ్నులో అంధురాలిగా నటించి మెప్పించారు నేషనల్ క్రష్మిక.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
