అందం చూడవయా.. ఆనందించవయా!
on Dec 6, 2022

ప్రస్తుతం ఎక్కడ చూసినా చలి పులి అని జనాలు వణికిపోతుంటే సిమ్లా యాపిల్‌లా ఉండే అందాల తార రాశీఖన్నా మాత్రం తన అపురూపమైన అంద చందాలతో వయ్యారాలు ఒలకబోస్తూ వైట్ కలర్ డ్రస్‌లో తన అందాలను కనిపించి కనపడనట్లు ఫోటోషూట్ ఫోటోలను రిలీజ్ చేసి కుర్రకారుకు హీట్ పెంచుతోంది. దీంతో ఈ ఫొటోలు ట్విట్టర్‌లో వైరల్ అవడమే కాకుండా ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఇక రాశీఖన్నా కెరీర్ విషయానికి వస్తే... ఈ మధ్య ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. మొదటి నుంచి కూడా రాశీ ఖన్నా తన కెరియర్ విషయంలో అంతగా దూకుడు చూపించలేదు. తనవంతుగా గ్లామర్ విషయంలో గానీ, లేక నటన, డాన్స్ విషయంలో గానీ చేయాల్సింది అంతా చేసినా.. సినిమాల ఫలితాలు మాత్రం రాశీఖన్నాకు కలిసిరావడం లేదు. ప్రస్తుతం ఆమె సిద్దార్థ్ మల్హోత్రా సరసన యోధ అనే బాలీవుడ్‌లో మూవీలో నటిస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఎన్టీఆర్, రవితేజలు నటించిన చిత్రాలు కూడా రాశీఖన్నాను ఏమాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తోన్న రాశికి ఈ ఫొటోషూట్ అయినా ఆఫర్స్ తీసుకొస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



