రాశీ ఖన్నా.. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్!
on Sep 24, 2021

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కథానాయికల్లో రాశీ ఖన్నా ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళం.. ఇలా మూడు భాషల్లో అరడజనుకి పైగా చిత్రాలు చేస్తోంది రాశి. అలాగే హిందీలో ఓ వెబ్ - సిరీస్ లో కూడా నటిస్తోంది ఈ ఉత్తరాది సోయగం.
ఇదిలా ఉంటే.. ఈ అక్టోబర్ మాసం రాశీ ఖన్నాకి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రాశి నటించిన రెండు ఆసక్తికరమైన చిత్రాలు జనం ముందుకు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందిన మలయాళ చిత్రం `భ్రమమ్` అక్టోబర్ 7న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుండగా.. తమిళ సినిమా `అరణ్మనై 3` అక్టోబర్ 14న థియేటర్స్ లోకి రానుంది. మరి.. వారం వ్యవధిలో వస్తున్న ఈ చిత్రాలతో రాశీ ఖన్నా ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
కాగా, `భ్రమమ్`లో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించగా రవి కె. చంద్రన్ దర్శకత్వం వహించారు. ఇక `అరణ్మనై 3` విషయానికి వస్తే ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాకి సుందర్.సి దర్శకుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



