రావు గోపాల్ రావు మార్గ్ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు చెప్పిన రావు రమేష్
on Feb 2, 2023
తెలుగు ఇండస్ట్రీలో విలనిజానికి ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది రావుగోపాలరావు. ఆయన నటించిన "వేటగాడు" మూవీలో సరికొత్త డైలాగ్ మాడ్యూలేషన్ తో తెలుగు వారి హృదయాల్ని దోచుకున్నారు ఆయన.
ఇక ఆయన కుమారుడు రావు రమేష్ కూడా ఇండస్ట్రీలో వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన యూట్యూబ్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు. "అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ అత్యంత ఇష్టమైన, వాళ్ళ జీవితంలో భాగమైపోయిన గొప్ప నటులు అంతకన్నా గొప్ప మానవతావాది మా నాన్న గారు రావు గోపాలరావు గారు. ఆయన పేరు మీద కాకినాడలోని సాలిపేటలో గోపాలరావు మార్గ్ అని పేరు పెట్టారు. ఆ విషయం తెలిసిన వెంటనే నాకు ఎంతో సంతోషంగా గొప్పగా అనిపించింది. ఇది ఆయనకు దక్కిన గౌరవం. వాళ్ళ అభిమానం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే కాకినాడ పురపాలక మండలికి, ఆయన అభిమానులకు, కాకినాడ యావత్ ప్రజానీకానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అన్నారు రావు రమేష్.
సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నో విలన్ రోల్స్ కి ప్రాణ ప్రతిష్ట చేసిన రావుగోపాలరావు నిజ జీవితంలో ఎంతో సౌమ్యంగా ఉండేవారు. ఆయన రాజ్యసభ సభ్యునిగానూ చేశారు. ఎన్నో మరపురాని పాత్రల్లో నటించారు. ఆయన నటవారసునిగా రావు రమేశ్ ఈతరం వారిని తనదైన నటనతో అలరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
