ఆ హీరో గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే సినిమాలో...!
on May 23, 2016

బాలీవుడ్ ప్లేబోయ్ రణ్ బీర్ కపూర్ ప్రేమకథలు నడపడంలో మంచి ఎక్స్ పర్ట్. ఇప్పటికే ఇద్దరు టాప్ హీరోయిన్లతో ఈయన రొమాన్స్ నడిపాడు. మొదట దీపికా పదుకునే తో చాలా స్ట్రాంగ్ రిలేషన్ షిప్ నడిపిన రణ్ బీర్, ఆ తర్వాత కత్రినా కైఫ్ తో పీకల్లోతు ప్రేమల్లో మునిగి తేలాడు. వీళ్లిద్దరి తోనూ కపూర్ల వారబ్బాయికి రిలేషన్ వర్కవ్వలేదు. అయితే ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఒకేసినిమాలో నటిస్తున్నారన్న వార్త బాలీవుడ్ జనాలకు షాక్ ఇస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ ఒక ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నాడు. సినిమాలో కింగ్ ఖాన్ మరుగుజ్జు వ్యక్తిలా కనిపిస్తాడట. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ మూవీలో, ఇప్పటివరకూ చాలా మందిని పరిశీలించి, చివరికి దీపిక, కత్రినాలను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇద్దరూ ఒకే వ్యక్తికి మాజీ లవర్స్ అయిన నేపథ్యంలో, కలిసి నటిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



