Home

»

Latest News

క్రికెట్ -అమ్మాయిలు-పెళ్లి నాకు అర్థం కావు- రానా

Apr 29, 2019 5:53PM

 

నాని క్రికెట‌ర్ గా న‌టించిన చిత్రం `జెర్సీ`. ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విజ‌య‌ప‌థంలో దూసుకుపోతుంది. ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. జెర్సీ సినిమా విపరీతంగా న‌చ్చిన రానా థ్యాంక్స్ మీట్ కు గెస్ట్ గా హాజ‌ర‌య్యాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ...``నాకు లైఫ్లో బేసిక్ గా కొన్ని అర్థం కావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్ల‌లు అస‌లు అర్థం కారు. ఇవ‌న్నీ అర్థం కానీ, నాకే ఈసినిమా చూసి ఏడుపొచ్చింది అంటే మిగిలిన ప్రేక్ష‌కులు సినిమా చూసి ఎలా ఫీల్ అయ్యుంటారో అర్థం చేస‌కోగ‌ల‌ను. నాని ప్ర‌తి రోజు న‌న్ను ఇన్ స్పైర్ చేస్తుంటాడు. గౌత‌మ్ స్టోరి టెల్ల‌ర్ గా... ఫిలిం మేక‌ర్ గా జెర్సీతో అంద‌రినీ ట‌చ్ చేసాడు. యుట‌ర్న్ నుండి శ్రద్ధా శ్రీనాత్ కు నేను పెద్ద ఫ్యాన్ ని. ఎంటైర్ టీమ్ కు ఇదొక మెరిట్ లా మిగిలిపోతుంది`` అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com