ENGLISH | TELUGU  

ఏప్రెల్ 9 న రానా, జెనీలియాతో పరుచూరి కిరీటి మూవీ

on Mar 29, 2011

jenilea hot wallpapers, jenilea hot stills, jenilea hot pics, jenilea hot images, jenilea hot photos, jenilea hot picturesఏప్రెల్ 9 న రానా హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించే సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. గతంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో "సింహా" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించబోతున్నారు. దర్శకుడిగా ప్రకాష్ తోలేటికిదే మొదటి చిత్రం కావటం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రెల్ తొమ్మిదవ తేదీన, హైదరాబాద్ నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో ఘనంగా ప్రారంభం కానుందని ఈ చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి మీడియాకు తెలిపారు.

ఏప్రెల్ 9 న రానా హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించే సినిమాలో రానా పాత్ర చాలా ఉత్కంఠ కలిగించేలా ఉంటుందనీ, హీరోయిన్ గా నటిస్తున్న జెనీలియా పాత్ర కూడా ఈ చిత్ర కథాగమనానికి తోడ్పడుతుందనీ ఈ చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. మార్చ్ 30 వ తేదీన ఈ యువ నిర్మాత పరుచూరి కిరిటి జన్మదినం సందర్భంగా అతనికి తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, తను నిర్మించబోతున్న ఈ చిత్రం "సింహా" కన్నా పెద్ద హిట్ కావాలని ఆశిస్తోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.