Home

»

Latest News

నాగ్ "రాజన్న" షూటింగ్ హైదరాబాద్ లో

Mar 29, 2011 10:17PM

nagarjuna wallpapers, nagarjuna stills, nagarjuna images, nagarjuna pics, nagarjuna photos, nagarjuna picturesనాగ్ హీరోగా నటిస్తున్న "రాజన్న" చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతూంది. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్, కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ, వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నిర్మిస్తున్న "రాజన్న" చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో శరవేగంగా జరుగుతూంది. ఈ చిత్రం రజాకార్ మూమెంట్ లో నిజాం నవాబు మీద తిరగబడ్డ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు రాజన్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడుతూంది. హైదరాబాద్ కి సుమారు వంద కిమీటర్ల దూరంలోని గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడుతూంది.

ఈ నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న"చిత్రానికి సంబంధించిన వివరాలను టి.ఆర్ .యస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ నాగార్జున హీరోగా నటిస్తున్న"రాజన్న"చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ యువ దర్శకుడు, విజయేంద్ర ప్రసాద్ కుమారుడు అయిన యస్.యస్.రాజమౌళి చిత్రీకరిస్తారని సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com