కన్నడ 'భక్త ప్రహ్లాద' రిఫరెన్స్‌తో రానా...
on Feb 10, 2020
.jpg)
పురాణాలు చదివినవాళ్లకు, పురాణాలపై అవగాహన ఉన్నవాళ్లకు రాక్షసరాజు హిరణ్యకశ్యపుడి గురించి తప్పకుండా తెలుస్తుంది. ప్రహ్లాదుడు ప్రార్ధింపగా శ్రీమహావిష్ణువు, నరసింహ అవతారమెత్తి హిరణ్యకశ్యపుడిని అంతం మొందిస్తాడు. అతడు వైకుంఠానికి వెళతాడు. ఫక్తు సినిమా ప్రేక్షకులకు అయితే... హిరణ్యకశ్యపుడి పేరు చెబితే 'భక్త ప్రహ్లాద' గుర్తొస్తుంది. ఇప్పుడీ ప్రస్తావన అంతా ఎందుకంటే... గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి 'హిరణ్యకశ్యప' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కన్నడ సినిమా 'భక్త ప్రహ్లాద'ను రానా రిఫరెన్స్‌గా తీసుకుంటున్నాడు. ఈ మాట అతడే చెప్పాడు.
తెలుగులోనూ 'భక్త ప్రహ్లాద' తీశారు. అందులో హిరణ్యకశ్యపుడి పాత్రలో మహా నటుడు ఎస్వీఆర్ నటించారు. ఆయన్ను వదిలేసి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సినిమా గురించి చెప్పడం వెనుక ఓ కారణం ఉంది. రీసెంట్ గా రానా బెంగళూరు వెళ్లాడు. అక్కడ మీడియాతో మాట్లాడినప్పుడు కన్నడ సినిమాల గురించి ప్రశ్న వచ్చింది. అప్పుడు... తాను రాజ్ కుమార్ వీరాభిమానిననీ, ప్రస్తుతం చేస్తున్న 'హిరణ్యకశ్యప'కు ఆయన 'భక్త ప్రహ్లాద'ను రెఫరెన్సుగా తీసుకుంటున్నాననీ చెప్పాడు. తెలుగుకు వస్తే... ఎస్వీఆర్ పేరు చెప్తాడేమో. మొన్నటివరకు రెస్ట్ లో ఉన్న రానా, ఇప్పుడు సినిమా పనుల్లో పడ్డాడు. హిందీలో 'హాథీ మేరీ సాథీ' డబ్బింగ్ పూర్తి చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



